Viral Video | పెండ్లి ఫొటోలు తీస్తూ కాలువలో పడిపోయిన మహిళ
పెండ్లి వేడుకలో వధూవరుల ఫొటోలు తీస్తూ ఓ మహిళ పొరపాటున కాలువలో పడిపోయిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో వధూవరుల ఫొటోలు తీస్తూ ఓ మహిళ పొరపాటున కాలువలో పడిపోయిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎక్కడ తీశారనేదానిపై స్పష్టత లేకున్నా ఇది దేశీ వెడ్డింగ్ కాదని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో మహిళ వధూవరుల ఫొటోలను తన ఫోన్లో రికార్డ్ చేస్తూ కనిపించారు.
ఆపై కొద్దిసేపటికి ఆమె వెనుకగా నడుస్తూ పొరపాటున కాలువలో పడిపోయింది. అక్కడున్న వారంతా ఆమెను మురికి నీటి నుంచి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం కనిపించింది. ఇక ఈ వైరల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. జంటను కెమెరాలో బంధించే క్రమంలో ఆమె పరిసరాలను గమనిస్తూ ఉండాల్సిందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.
ఆమెకు గాయాలేమైనా అయ్యాయా అని ఓ ఇన్స్టాగ్రాం యూజర్ ఆరా తీయగా, ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని తాను ఆశిస్తున్నానని మరో యూజర్ కామెంట్ చేశారు. ఫొటోలు తీసేందుకు కొందరు ఎందుకు వెనుకాముందు చూడరని మరో యూజర్ సందేహం వ్యక్తం చేశారు.
Read More :
Sleeping Beauty | రియల్ లైఫ్ స్లీపింగ్ బ్యూటీ : రోజుకు 22 గంటలు నిద్రిస్తున్న మహిళ
viral video | పులి వర్సెస్ జింక : దాడి చేయకుండానే దాటి వెళ్లిన టైగర్
Viral Video | జంగిల్ సఫారీలో చిరుత వీడియోను షేర్ చేసిన సచిన్ టెండూల్కర్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drain
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

