న్యూఢిల్లీ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఫాలోయర్లను ఆకట్టుకునే పోస్ట్‌లు షేర్ చేస్తుంటారు. సచిన్ తాజాగా తన లేటెస్ట్ ట్రిప్ విశేషాలను వెల్లడిస్తూ ఓ వీడియోను (Viral Video) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో జంగిల్ సఫారీ సందర్భంగా తీసిన వీడియోలో చిరుత కనిపిస్తుంది.
అడవిలో అటూ ఇటూ తిరుగుతున్న ఈ వైల్డ్‌క్యాట్ నెటిజన్లను ఆకట్టుకుంది. వన్యప్రాణి ప్రేమికులను ఈ వీడియో ఎంతగానో అలరిస్తోంది. ఈ చిరుతను లెజెండరీ క్రికెటర్ హైడ్ అండ్ సీక్ ఛాంపియన్‌గా పిలిచారు. అల్టిమేట్ హైడ్ అండ్ సీక్ ఛాంపియన్‌ను మీరు గుర్తించారా..? అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటినుంచి పది లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ క్లిప్‌ను చూసిన సచిన్ ఫ్యాన్స్, ఫాలోయర్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్‌ను హోరెత్తించారు.
Read More :
King Cobra | వామ్మో.. ఎంత పెద్ద కింగ్ కోబ్రానో.. వీడియో వైరల్