Sleeping Beauty | రియల్ లైఫ్ స్లీపింగ్ బ్యూటీ : రోజుకు 22 గంటలు నిద్రిస్తున్న మహిళ
అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళ రోజుకు ఏకంగా 22 గంటలు నిద్రిస్తుండటంతో ఆమెను రియల్ లైఫ్ స్లీపింగ్ బ్యూటీగా (Sleeping Beauty) పిలుస్తున్నారు.
న్యూయార్క్ : అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళ రోజుకు ఏకంగా 22 గంటలు నిద్రిస్తుండటంతో ఆమెను రియల్ లైఫ్ స్లీపింగ్ బ్యూటీగా (Sleeping Beauty) పిలుస్తున్నారు. జొనా కాక్స్ (38) అతి నిద్రతో బాధపడుతూ పగలు మేల్కొని ఉండేందుకు నానా పాట్లు పడుతోంది. నిద్ర లేవడం కష్టంగా అనిపిస్తూ విశ్రాంతి లేమితో కుంగుబాటుకు గురయ్యే పరిస్ధితి కలిగిన ఇడియోపాథిక్ హైపర్సోమ్నియాతో ఆమె బాధపడుతోంది. 2017లో పగలంతా విపరీతమైన అలసటకు గురవడంతో ఆమెకు ఈ విచిత్రమైన లక్షణాలు ఎదురయ్యాయి. క్లబ్బులు, కారులు ఇలా ఎక్కడ పడితే అక్కడ నిద్రకు ఉపక్రమించిన అనుభవాలు జొనాకు ఎదురయ్యాయి.
తొలుత కుంగుబాటుకు గురైనట్టు అనిపించి మానసిక వైద్యులను సంప్రదించింది. అలసటతో పాటు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో డిప్రెషన్ కాదని గుర్తించామని జొనా చెప్పుకొచ్చింది. ఇక లక్షణాలు మరింత విషమించడంతో ఆమె ఏ వ్యాధికి లోనయ్యారనేది ఎవరూ గుర్తించలేకపోయారు. అతినిద్రతో 2019లో జొనా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆపై 2021 అక్టోబర్‌లో ఆమెను యార్క్‌షైర్‌లోని స్లీప్ క్లినిక్‌కు తీసుకువెళ్లగా జొనా అరుదైన స్లీప్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు బయటపడింది. ఇక అప్పటినుంచి ఆమె పరిస్ధితి ఏటికేడు దిగజారుతోంది. నిద్ర లేవాలని అనిపిస్తే ఆమె బెడ్‌పైకి వందలాది సాలీడ్లు దాడి చేసినట్టు అనిపించేది.
ఆహారం తయారయ్యే లోపు నిద్ర ముంచుకొస్తుందనే భయంతో జొనా ప్రొటీన్ షేక్స్, రెడీ టూ ఈట్ ఫుడ్‌ను ఎంచుకునేది. ఈ పరిస్ధితి తనకు నరకాన్ని తలపిస్తోందని, తాను రియల్ లైఫ్ స్లీపింగ్ బ్యూటీనని..తాను నిద్రపోతే ఇక లేవలేనని..డ్రైవింగ్ చేయలేను..నేను మెళకువగా ఉంటానని తెలీదు కనుక ఎలాంటి ప్లాన్లూ ఉండవని జొనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓ రోజు తాను 12 గంటలు మేలుకొన్నానని, ఆరేండ్లలో ఎక్కువసేపు నిద్రించని సమయం ఇదేనని పేర్కొంది. ఎన్నో మందులు, థెరఫీలు వాడినా తన పరిస్ధితి మెరుగవలేదని, తాను మళ్లీ సాధారణ జీవితం గడిపేలా సాయం చేసే వైద్యుడు త్వరలోనే తనకు అందుబాటులోకి వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
Read More :
Happiness | సంతోషమా నువ్వెక్కడా? ఈ 5 నియమాలనూ పాటిస్తే హాయిగా బతికేయవచ్చు.
షిఫాన్ చీర.. తుఫాన్ తార
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Joanna Cox
- sleep
- viral news
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

