ఆమె షిఫాన్ క్రేప్ చీరలో తుఫాను రేపుతున్నది. పెరల్ ఎంబ్రాయిడరీ బోర్డర్లోని ముత్యాల వరుసలు.. ప్రేయసి ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తున్న ప్రేమికులను తలపిస్తాయి.
బాక్స్ నెక్ స్లీవ్‌లెస్ జాకెట్ చీరకు అతికినట్టు సరిపోయింది. ఆమె చెవులకు వేలాడుతున్న పెద్దపెద్ద జుంకాలకు చారెడు కళ్లు సవాలు విసురుతున్నాయి. ‘ఉగ్రం’ కథానాయిక మిర్నా మీనన్ మోములోని శాంతికి, కాంతికి ఖరీదుకట్టే షరాబు లేడోయ్!