Happiness | సంతోషమే సగం బలం. అయితే ఆ సంతోషం మన ఆలోచనలు, జీవన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. విజయానికి దగ్గరిదార్లు లేనట్టే, సంతోషానికి కూడా చిట్కాలు ఉండవు. కాకపోతే, ఈ ఐదు నియమాలనూ పాటిస్తే హాయిగా బతికేయవచ్చు.
మనం జీవితంలో ఎదిగేందుకు, విజయం సాధించేందుకు సహకరించిన వారికి మర్చిపోకుండా కృతజ్ఞతలు తెలపాలి. సత్సంబంధాలు మనకు స్ఫూర్తినిచ్చేవారిని, మనల్ని మనలా ప్రేమించేవారిని, మనకు అండగా నిలిచేవాళ్లను ఎప్పడూ దూరం చేసుకోకూడదు.
మానసిక, శారీరక ఆరోగ్యాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఓ అరగంట వ్యాయామం చేయాలి. దీనివల్ల రోజంతా ఆనందంగా ఉండటానికి సరిపడా ఎండార్ఫిన్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయి.
మన గురించి మనం ఆలోచించడంలో తెలియని సంతృప్తి ఉన్నా.. దానివల్ల, జీవితంలో ఎదురయ్యే అనూహ్య మార్పులకు సిద్ధం కాలేం. పైగా ఇలాంటి కురచ మనస్తత్వం ఎదుగుదలకు అవరోధం అవుతుంది. కాబట్టి, విశాల దృక్పథం అవసరం.
పరిస్థితులను అనుసరించి ఎలా ఉండాలో, ఎలా మసలుకోవాలో తెలుసుకోగలగాలి. అప్పుడే కష్టసుఖాలను యథాతథంగా తీసుకుంటాం.