సీఎం పదవి నుంచి బొమ్మై అవుట్.. సీఎంను మార్చే యోచనలో బీజేపీ?
కర్నాటకలో ముఖ్యమంత్రిని మార్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. పక్కాగా ఓ నిర్ణయానికి రాకపోయినా… ఆ దిశగా బీజేపీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సీఎం బొమ్మైని మార్చేయాలని బీజేపీ ఆలోచన.
ఇక… ఇలాంటి పుకార్లు వస్తున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగళూరులో పర్యటిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అతి త్వరలోనే బొమ్మై తన కేబినెట్‌ను విస్తరిస్తారని, ఈ విస్తరణ పూర్తవ్వగానే ఆయన పదవీ నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది.
ఇక.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింది నుంచి పై స్థాయి వరకు తాము మార్పులు చేయాలనుకుంటే చేసేస్తామని, అందులో ఏమాత్రం సంకోచించమని గుజరాత్, ఢిల్లీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారు. ఇలా ఒక్కసారిగా మార్పులు చేయడం బీజేపీలో సాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు.
కర్నాటకలో ప్రస్తుతం బీఎల్ సంతోశ్ వ్యాఖ్యలనే అందరూ ఉటంకిస్తున్నారు. అతి త్వరలోనే సీఎం బొమ్మై స్థానంలో కొత్త వ్యక్తి సీఎంగా వస్తారని పరోక్షంగా పేర్కొంటున్నారు. అయితే ఈ పుకార్లపై సీఎం బొమ్మై స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

