Bangladesh crisis | బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం: మమతా బెనర్జీ
Bangladesh crisis | బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. ఆందోళనల్లో వంద మందికిపైగా మరణించారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలపై మమతా బెనర్జీ స్పందించారు.
కోల్‌కతా: బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. (Bangladesh crisis) ఆందోళనల్లో వంద మందికిపైగా మరణించారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలపై మమతా బెనర్జీ స్పందించారు. ఆదివారం కోల్‌కతాలో భారీ వర్షం మధ్య తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నిర్వహించిన ‘అమరవీరుల దినోత్సవం’ ర్యాలీలో ఆమె మాట్లాడారు. హింసాత్మక బంగ్లాదేశ్ ప్రజలు మా తలుపు తడితే వారికి ఆశ్రయం కల్పిస్తాం అని చెప్పారు. ‘బంగ్లాదేశ్ మరో దేశం. కాబట్టి దాని గురించి ఏమీ మాట్లాడను. బంగ్లాదేశ్ గురించి భారత ప్రభుత్వం మాట్లాడుతుంది. కానీ బంగ్లాదేశ్ నుంచి నిస్సహాయులు బెంగాల్ తలుపు తడితే, మేం వారికి ఆశ్రయం ఇస్తాం. పొరుగువారి శరణార్థులను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉంది’ అని అన్నారు.
కాగా, పెరుగుతున్న హింస కారణంగా బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న బెంగాల్ నివాసితులకు అన్ని విధాలా సహకారాన్ని అందిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. అలాగే బెంగాల్‌కు వచ్చిన బంగ్లాదేశీయులకు కూడా సహాయం అందిస్తామన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన అంశాలపై రెచ్చగొట్టే పనులు చేయవద్దని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మనం సంయమనం పాటించాలి. సమస్యపై ఎటువంటి రెచ్చగొట్టడం లేదా ఉత్సాహం చూపకూడదు’ అని అన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింసాకాండ బాధితులకు మమతా బెనర్జీ సంఘీభావం తెలిపారు. అలాగే సమస్య త్వరగా ముగియాలని ఆమె ఆకాంక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

