ముంబై : న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థలో సంపూర్ణ పారదర్శకతను తీసుకొస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హామీ ఇచ్చారు. ప్రతిభ విషయంలో రాజీ పడేది లేదని, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు. బాంబే బార్ అసోసియేషన్ శుక్రవారం ఆయనను సన్మానించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కన్నా ముందు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా పని చేసినప్పటి నుంచి నియామకాల విషయంలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు కొలీజియం ప్రయత్నిస్తున్నదన్నారు.