Viral video: గుంతలో ఇరుక్కుపోయిన ఏనుగుపిల్ల.. అర్ధరాత్రి నాలుగు గంటలపాటు కష్టపడి కాపాడిన ఫారెస్ట్ అధికారులు!!
ఓ ఏనుగుపిల్ల తల్లినుంచి తప్పిపోయి ఇరుకైన గుంతలో ఇరుక్కుపోయింది. అర్ధరాత్రి సమాచారం అందుకున్న ఫారెస్ట్సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఒంటిగంటకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి, చివరికి ఆ ఏనుగు పిల్లను కాపాడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఓ ఏనుగుపిల్ల తల్లినుంచి తప్పిపోయి ఇరుకైన గుంతలో ఇరుక్కుపోయింది. అర్ధరాత్రి సమాచారం అందుకున్న ఫారెస్ట్సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఒంటిగంటకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి, చివరికి ఆ ఏనుగు పిల్లను కాపాడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విటర్లో షేర్ చేశారు. ఏనుగుపిల్లను పైకిలాగేందుకు ప్రయత్నించినా అధికారుల వల్ల కాలేదు. ఒక ఎక్స్‌కవేటర్‌తో పెద్ద గుంత తవ్వారు. అనంతరం ఒక అధికారి చీకటి గొయ్యిలోకి దిగి, అప్పటికే అలసిపోయి పడుకున్న ఏనుగుకు తాడును బిగించాడు. మిగతా అధికారులు దాన్ని పైకి లాగారు. చివరగా, పిల్ల ఏనుగును దాని కుటుంబంతో కలిపారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టగా..అర్ధరాత్రిపూట ఏనుగుపిల్లను కాపాడేందుకు వెళ్లిన అధికారుల అంకితభావాన్ని నెటిజన్లు ప్రశంసించారు.
At 1 AM teams got info of an elephant calf falling in a ditch. A long rescue operation in dead of night. By 5 AM he was rescued successfully. And then guided back to family which was in nearby forest. Team ✌️✌️ pic.twitter.com/pLC3FFKaxj
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

