Karnataka High Court: నల్లగా ఉన్నాడని భర్తను వేధించడం క్రూరత్వమే.. విడాకులిచ్చిన కర్నాటక హైకోర్టు
Karnataka HC: నల్లగా ఉన్నాడని భర్తను వేధించిడం క్రూరత్వం అవుతుందని కర్నాటక హైకోర్టు తెలిపింది. లేనిపోని కారణాలతో భర్తను దూరంపెట్టిన భార్య వైఖరిని కూడా కోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో విడాకులు మంజూరీ చేస్తున్నట్లు కర్నాటక హైకోర్టు పేర్కొన్నది.
బెంగుళూరు: భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య వేధించింది. దీనిపై ఆ భర్త కోర్టుకెక్కాడు. ఆ కేసులో కర్నాటక హైకోర్టు(Karnataka High Court) విడాకులు మంజూరీ చేసింది. నల్లగా ఉన్నాడని భర్తను వేధించడం క్రూరత్వమే అవుతుందని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. నల్లగా ఉన్నాడని పదేపదే వేధించడం వల్లే భర్త తన భార్యను విడిచివెళ్లాల్సి వచ్చిందని కోర్టు తెలిపింది. అయితే తన వేధింపులను కప్పిపుచ్చేందుకు భర్తపై భార్య లేనిపోని ఆరోపణలు చేసినట్లు కూడా కోర్టు పేర్కొన్నది. భర్తపై అక్రమ సంబంధం ఆరోపణలు కూడా చేసినట్లు తెలిపింది. అక్రమ రీతిలో భర్తపై ఆరోపణలు చేసిన భార్య.. క్రూరత్వానికి పాల్పడినట్లే అని కోర్టు వెల్లడించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(ఐ)(ఏ) ప్రకారం ఆ జంటకు విడాకులు జారీ చేశారు.
బెంగుళూరుకు చెందిన ఆ జంట 2007లో పెళ్లి చేసుకున్నది. వాళ్లకు ఓ అమ్మాయి పుట్టింది. అయితే 2012లో విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును భర్త ఆశ్రయించాడు. ఆ కేసులో జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనంత రామనాథ్ హెగ్డేలతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. కేవలం కూతురి కోసం భర్త ఆ అవమానాలు భరించినట్లు కోర్టు తెలిపింది. అయితే భర్తే తనను వేధించినట్లు భార్య గృహహిం కేసు పెట్టినా.. ఆ కేసు పూర్వపరాలు పరిశీలించిన కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది. భర్తతో కలిసి ఉండేందుకు భార్య రాలేదని, ఆ వైవాహిక బంధంలో కొనసాగేందుకు ఆమెకు ఇష్టం లేదన్న విషయాన్ని గ్రహించామని, అందుకే ఆ జంటకు విడాకులు మంజూరీ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

