గువహటి: అస్సాంలో 60 ఏండ్ల వృద్ధుడు ఘాతుకానికి పాల్పడాడు. భార్యతో గొడవపడి ఆవేశంలో ఆమె తలనరికి.. అనంతరం తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ భయానక ఘటన శనివారం రాత్రి చిరాంగ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ బల్లంగురికి చెందిన బితిశ్ హజోంగ్ శనివారం కూలి పని నుంచి ఇంటికి తిరిగి రాగానే భార్య బజంతితో చిన్న విషయమై గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆవేశంలో పదునైన ఆయుధంతో ఆమె తల నరికి హత్య చేశాడు.
అనంతరం సైకిల్లో నేరుగా బల్లంగురి అవుట్‌పోస్ట్‌కు వెళ్లి పోలీసులకు భార్య తల అప్పగించి వారికి లొంగిపోయాడు. నిందితుడు నిత్యం భార్యతో చిన్న చిన్న విషయాలకు గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. బజంతి మృతదేహాన్ని శవ పరీక్షకు పంపారు. ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.