Karnataka CM: శివకుమారా లేక సిద్ధిరామయ్యా.. కర్ణాటక సీఎం అయ్యేదెవరు?
Karnataka CM: శివకుమారా లేక సిద్ధిరామయ్యా.. కర్నాటక సీఎం అయ్యేదెవరన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. సిద్ధిరామయ్యే సీఎం అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ శివకుమార్‌కు కూడా ఆ పోస్టు దక్కే ఛాన్సు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ కాంగ్రెస్‌కే కన్ఫర్మ్ అయ్యింది. తాజా కౌంటింగ్‌లో ఆ పార్టీ 122 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 113 సీట్లు వచ్చిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం(Karnataka CM) అవుతారన్నదే కీలకంగా మారింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) లేదా సీనియర్ సిద్ధిరామయ్య(Siddiramaiah).. ఈ ఇద్దరిలో ఎవరు సీఎం పోస్టును చేజిక్కించుకుంటారో ఇంకా క్లారిటీ లేదు.
ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ పార్టీ కోసం విస్తృతంగా టూర్ చేశారు. కర్ణాటక సీఎంగా సిద్ధిరామయ్యకే ఎక్కువ ఛాన్సు ఉందని పార్టీలోని వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం కోసం డీకే శివకుమార్ తీవ్రంగా కష్టపడ్డారు. అయితే శివకుమార్‌కు మంచి పోస్టే దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఇద్దరి మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా కుదిరినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్‌కు తొలుత ఓ ఉన్నత పోస్టు ఇచ్చినా.. ఆ తర్వాత ఆయనే ఆ రాష్ట్ర సీఎం అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

