Manohar Lal Khattar | ఉపరాష్ట్రపతి.. బీజేపీ చీఫ్.. ఈ రెండు పదవుల్లో ఏది ఎంచుకుంటారు.. కేంద్ర మంత్రి ఖట్టర్ ఏమన్నారంటే?
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామాతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉన్నది. ఇక బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. ఈ రెండు పదవుల కోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నది.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామాతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉన్నది. ఇక బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. ఈ రెండు పదవుల కోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కేంద్ర గృహనిర్మాణ, అర్బన్ అఫైర్స్ మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు (Manohar Lal Khattar) ఓ ప్రశ్న ఎదురయింది. ఉపరాష్ట్రపతి, బీజేపీ అధ్యక్ష పదవి.. ఈ రెండిటిలో దేనిని ఎంచుకుంటారని ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి ఆయన ఏం సమాధానం ఇచ్చారంటే.. ‘నేను దేనిని ఎంచుకోను. నాకు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని, దానికి అనుగుణంగానే పనిచేస్తానని’ ఖట్టర్ వెల్లడించారు.
మనకు అప్పగించే బాధ్యత ఏదైనా సమర్ధవంతంగా పనిచేయాలి. అది చిన్నదా? పెద్దదా? అని ఆలోచించకూడదు. ఉపరాష్ట్రపతి లేదా బీజేపీ చీఫ్ కాకపోయినా.. నేను చేయడానికి తగినంత పని ఉంది. నాకు మరొకటి దక్కుతుంది అని సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ రెండు పదవులకు కొత్త వారిని నియమించాల్సి ఉంటుందని తెలిపారు.
కొత్త ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఐదేండ్లు
పదవిలో ఉండగా ఉప రాష్ట్రపతి రాజీనామా చేసినా, మరణించినా, ఆయన్ని తొలగించినా సాధ్యమైనంత త్వరగా అంటే గరిష్ఠంగా 60 రోజుల్లో తదుపరి ఉప రాష్ట్రపతిని నియమించాలని రాజ్యాంగంలోని 68వ అధికరణంలోని క్లాజ్ 2 పేర్కొంటున్నది. ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన వ్యక్తి మిగిలిన కాలానికి కాకుండా పదవిని చేపట్టిన రోజు నుంచి మొత్తం ఐదేండ్లు ఆ పదవిలో కొనసాగుతారు.
ఉప రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకొంటుంది.పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తుతం ఉన్న 782 మంది సభ్యులు ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కనీసం 392 మంది సభ్యుల మద్ధతు కలిగిన అభ్యర్థి ఉప రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. ఉభయ సభల్లో ఎన్డీఏకు ప్రస్తుతం 426 మంది ఎంపీల బలం ఉన్నది. ఇండియా కూటమికి 312 మంది సభ్యుల బలం ఉన్నది.
ఇవికూడా చదవండి..
మైనర్‌గా ఉన్నప్పుడు రేప్.. 53 ఏండ్ల వయసులో జువెనైల్ బోర్డ్‌కు
వివాహేతర సంబంధాల్లో ఆరో స్థానంలో భారత్.. ఆష్లే మాడిసన్ నివేదిక వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

