న్యూఢిల్లీ, మార్చి 19: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2008 లో ఓ వార్త సంచలనం సృష్టించింది. అడాల్ఫ్ హిట్లర్‌ను జాన్ ఎఫ్ కెనడీ అరెస్టు చేశారన్నదని ఆ వార్త సారాం శం. కానీ, నాడు అరెస్టయింది జర్మనీ నియంత హిట్లర్ కాదు. ఆయనను అ రెస్టు చేసింది అమెరికా మాజీ అధ్యక్షు డు కెనడీ కాదు. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే.. మేఘాలయ అసెంబ్లీకి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అడా ల్ఫ్ లు హిట్లర్ మారక్‌ను ఎన్నికల ప్ర చార సమయంలో ఎస్పీ జాన్ ఎఫ్ కె నడీ అరెస్టు చేశారు. అప్పట్లో పలు ప త్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించడంతో సర్వత్రా చర్చనీయాంశం గా మారింది. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో హిట్లర్ గెలుపొందారు. ఆ ఉదంతాన్ని ఈసీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.