Home
National
When I Was Mp I Along With Others Fought In Lok Sabha For Caste Based Census Rjd Chief Lalu Prasad Yadav
కుల ఆధారిత జనాభా గణన కోసం నాడు పోరాడా: లాలూ ప్రసాద్

న్యూఢిల్లీ: తాను ఎంపీగా ఉన్నప్పుడు, కుల ఆధారిత జనాభా గణన కోసం ఇతరులతో కలిసి లోక్‌సభలో పోరాడినట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గతంలో దీనిపై రాత పూర్వకంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కుల ఆధారిత జనాభా గణన గురించి తాము చాలా ఆశతో ఉన్నట్లు లాలూ చెప్పారు. జనాభా, ప్రజల ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి కులం ఆధారంగా జనాభా గణనను చేపట్టాలని కేంద్రాన్ని ఆయన కోరారు.
కాగా, బీహార్ సీఎం నితీశ్ కుమార్, అఖిలపక్ష నేతలతో కలిసి ఈ అంశంపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి తేజస్వీతో ప్రధాని మోదీ ఆరా తీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

