CM Siddaramaiah: షర్ట్ విప్పమన్నారు.. ఇక నేను ఆ గుడిలోకి వెళ్లలేదు: కర్నాటక సీఎం
CM Siddaramaiah: ఓసారి కేరళలో ఓ గుడికి వెళ్తే తనను షర్ట్ విప్పమన్నారని, అయితే షర్ట్ విప్పడం ఇష్టం లేక తాను గుడిలోకి వెళ్లలేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సనాతన ధర్మంపై ఓ వైపు వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు మరింత దుమారం సృష్టిస్తున్నాయి.
బెంగుళూరు: ఒకవైపు సనాతన ధర్మంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. మరో వైపు కర్నాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సారి కేరళలోని ఓ ఆలయంలో జరిగిన ఘటన గురించి ఆయన కామెంట్ చేశారు. బెంగుళూరులో నారాయణ గురువుకు చెందిన 169వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఓసారి కేరళలో ఓ ఆలయానికి వెళ్తే, షర్ట్ విప్పి లోపలికి వెళ్లాలన్నారని, అయితే ఆ ఆలయంలోకి వెళ్లేందుకు తాను నిరాకరించినట్లు గుర్తు చేశారు. గుడి బయట నుంచే దేవుడికి మొక్కుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కర్నీ షర్ట్ తీసివేయాలని కోరలేదని, కొందర్ని మాత్రం అలా అడిగారని సిద్ధరామయ్య తెలిపారు. ఇలాంటి పద్ధతి అమానవీయంగా తోచినట్లు సీఎం వెల్లడించారు. దేవుడి ముందు అందరూ సమానమే అని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

