Siddaramaiah : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని, సీఎం సిద్ధరామయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రగిలించాయి. అయితే ఈ వ్యాఖ్యలను సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. యెడ్యూరప్పపై ఉన్న కేసుల గురించి గుర్తుచేశారు. తన రాజీనామా అడిగే హక్కు ఆయనకు లేదన్నారు.
యెడ్యూరప్ప డిమాండ్‌ను ప్రస్తావించిన మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘యెడ్యూరప్పపై పోక్సో కేసు ఉంది. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా..? ఆయన రాజకీయాల్లో ఉండవచ్చా..? నా రాజీనామా అడిగేందుకు ఆయనకు ఏ నైతిక హక్కు ఉన్నది..? ఆయనపై చార్జిషీట్ దాఖలైంది. కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆయన బయట ఉన్నారు. లేదంటే పోక్సో కేసులో జైల్లో ఉండేవారు.’ అని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలోని 21 కేసులపై తాము విచారణకు ఆదేశించామని, ఆదేవిధంగా మిగతా కేసులలో కూడా విచారణకు ఆదేశిస్తామని సిద్ధరామయ్య వెల్లడించారు.