Home
National
West Bengal Caretaker Chief Minister Mamata Banerjee Has Called A Meeting Today With Chief Secretary Home Secretary Dgp
బెంగాల్ హింస: ఉన్నతాధికారులతో మమతాబెనర్జి సమీక్ష
Mamata Banerjee: పశ్చిమబెంగాల్లో మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పలుచోట్ల హింస చోటుచేసుకుంది.

కోల్కతా: పశ్చిమబెంగాల్లో మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పలుచోట్ల హింస చోటుచేసుకుంది. ఈ హింసాత్మక ఘటనలపై బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ఆరోపణలు చేసుకుంటున్నారు. తృణమూల్ గూండాలే తమ కార్యకర్తలపై, వారి ఇండ్లపై దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీ కార్యకర్తలే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు పశ్చిమబెంగాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశాని పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రెటరీ, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో హింస నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

