Gulab Jamun Parantha | గులాబ్ జామున్ తెలుసు.. పరాటా తెలుసు. కానీ ఈ రెండింటిని మిక్స్ చేసే ఫుడ్ మాత్రం మేము ఎప్పుడూ తినలేదు అంటారా. అవును.. మీరే కాదు.. ఇప్పటి వరకు ఇటువంటి కొత్త వంటకాన్ని ఎవ్వరూ టేస్ట్ చేసి ఉండరు. ఎందుకంటే.. గులాబ్ జామున్ పరాటా అంతటా దొరకదు. కేవలం ఒక్క స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గరే దొరుకుతుంది. ఓ స్ట్రీట్ ఫుడ్ అమ్మే వ్యక్తి చేసిన కొత్త రకం వంటకం ఇది.
ఇప్పటి వరకు మ్యాగీ పానీపూరీ, ఫాంటా మ్యాగీ, యాపిల్ బజ్జీ, ఓరియో బజ్జీ, పానీపూరీ ఐస్‌క్రీమ్ లాంటి ఎన్నో రకాల విచిత్రమైన.. వికారమైన ఫుడ్‌ను చూశాం కదా. ఇది గులాబ్ జామున్ పరాటా అన్నమాట. దీన్ని ఎలా తయారు చేస్తారో చెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. దీని టేస్ట్ మాత్రం అదుర్స్ అంటూ టేస్ట్ బర్డ్ అనే ఇన్‌స్టాలో ఓ ఫుడ్ బ్లాగర్ వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో ఇదేం కొత్త వంటకం బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం నిజమే.. గులాబ్ జామున్‌తో చేసిన పరాటా కాబట్టి.. టేస్ట్ బాగానే ఉంటుంది అంటున్నారు. మరి మీకు కూడా ఈ కొత్త రకం పరాటా తినాలని ఉందా? అయితే వెంటనే ఆగ్రాకు చెక్కేయండి.