బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చెందిన సిటీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు ఒకటి. అలాంటి ప్రాంతంలో ఒక హౌసింగ్ కాంప్లెక్స్‌లో తీవ్రమైన సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌కు నీటి కనెక్షన్ లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్లుగా తిప్పలు పడుతున్న స్థానికులు.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పన్నెండేళ్లుగా బెంగళూరు వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డులకు ఫీజులు చెల్లిస్తున్నామని, అయినా కూడా ఇప్పటి వరకూ నీటి కనెక్షన్ ఇవ్వలేదని స్థానికులు మండిపడుతున్నారు. పరిశుభ్రత అనేది కూడా పౌరుల ప్రాథమిక హక్కేనని, ఇలా నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం ఆ హక్కును ఉల్లంఘించడమేనని కొందరు స్థానికులు అంటున్నారు. ఈ అపార్ట్మెంటు నిర్మాణం 2009లో పూర్తయింది, అప్పటి నుంచి ఇక్కడికి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం గమనార్హం.