తల్లితో కలిసి చిన్నారి పాట.. నవ్వులు పూయిస్తున్న వీడియో

న్యూఢిల్లీ: ఒక చిన్నారి తల్లితో కలిసి పాడిన పాట, హావాభావాలు నవ్వులు పూయించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 2015లో విడుదలైన బాలీవుడ్ చిత్రం తమాషాలో అరిజిత్ సింగ్, అల్కా యాగ్నిక్ పాడిన అగర్ తుమ్ సాత్ హో.. ఎంతో పాపులర్ అయింది. అంజనా మదతిల్ అనే మహిళ ఉకులేలే అనే చిన్న గిటార్‌ను వాయిస్తూ ఈ పాట పాడారు. తల్లి పక్కనే కూర్చొన్న బాలిక కూడా పెదాలు కలుపుతూ ఈ పాట పాడింది. అంతేగాక ఆ చిట్టితల్లి ఈ పాటకు అనుగుణంగా చేతులు, తల వూపుతూ ప్రదర్శించిన హావాభావాలు నవ్వులు పూయించాయి.
49 సెకండ్లు ఉన్న ఈ వీడియోను గత వారం అంజన తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉకులేలేపై పాటను సాధన చేయడం ఇదే తొలిసారని, దీనికి ఆరు నెలల సమయం పట్టిందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే 2.7 లక్షల మంది దీనిని చూశారు. చాలా మంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
This is so beautiful ❤️❤️हम सब साथ है.. we are there for each other.. आपण एकमेकांना आहोत. Prayers for all 🙏 https://t.co/f1FKCB6h76
— Amruta Subhash (@AmrutaSubhash) April 26, 2021
ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ చిన్నారి పాటకు, హావాభావాలకు మంత్ర ముగ్ధులయ్యారు. చిట్టి తల్లి చాలా బాగా పాడిందని పలువురు మెచ్చుకున్నారు. కరోనా కష్టకాలంలో ఇలాంటివి కొంత ఊరటనిస్తాయని కొందరు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

