తిరుచిరాపల్లిలో జల్లికట్టు.. రుసరుసలాడుతున్న ఆంబోతులు.. అణిచే ప్రయత్నంలో యువకులు.. వీడియో
Jallikattu event | సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా జల్లికట్టు క్రీడలు జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని
చెన్నై: సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా జల్లికట్టు క్రీడలు జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం ఉదయం తిరుచిరాపల్లి జిల్లాలో జల్లికట్టు క్రీడ మొదలైంది. జిల్లాలోని సూరియూర్ గ్రామంలో జల్లికట్టు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ జరిగే జల్లికట్టులో ఏకంగా 600 ఎద్దులు పాల్గొనబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. జల్లికట్టు సందర్భంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం 300 మంది పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇక్కడ నిర్వహించే జల్లికట్టులో ఒక్కో ఆంబోతును క్రీడా మైదానంలోకి విడిచిపెడతారు.
కోపంతో రుసరుసలాడుతూ వచ్చే ఆ ఆంబోతును అప్పటికే మైదానంలో సిద్ధంగా ఉన్న పలువురు అణిచే ప్రయత్నం చేస్తారు. అలా ఆంబోతును ఎవరైతే అణిచి కింద పడేయగలుగుతారో వారిని విజేతలుగా ప్రకటిస్తారు. తిరుచిరాపల్లిలో మొదలైన జల్లికట్టు వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.
#WATCH | Tamil Nadu: First #Jallikattu event of the year in Tiruchirappalli district began in Sooriyur village today. 600 bulls are expected to participate here. More than 300 police personnel are deployed for security. pic.twitter.com/9nfLlNybOg
— ANI (@ANI) January 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

