K Annamalai : అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగికదాడి ఘటనను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనకు నిరసనగా ఆయన అంతకుముందే చేసిన వాగ్ధానం ప్రకారం ఇవాళ కోయంబత్తూరులోని తన ఇంటి ముందు కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నారు. అంతేగాక ఇవాళ్టి నుంచి 48 రోజులపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
డీఎంకే పాలనలో రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయమే జరుగుతున్నదని అన్నామలై ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాలను నిరసిస్తూ తమను తాము కొరడాలతో కొట్టుకోవడం, తమను తాము శిక్షించుకోవడం అనేది తమిళనాడు సంస్కృతిలో భాగంగా ఉన్నదని ఆయన అన్నారు. పూర్వకాలం నుంచి ఉన్న సంప్రదాయాన్నే తాను ఇప్పుడు పాటించానని చెప్పారు. తన నిరసన ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదని చెప్పారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగానే తాను నిరసన తెలియజేస్తున్నానని అన్నామలై వెల్లడించారు. అన్నా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఘటన అలాంటి అన్యాయాల్లో ఒకటని చెప్పారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులకు వ్యతిరేకంగా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయని అన్నామలై తెలిపారు. మహిళలు, పిల్లలు అన్యాయాలకు గురవుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో అవినీతి కూడా పెరిగిపోయిందని అన్నామలై విమర్శించారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగానే తాను నిరసన తెలియజేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం గద్దెదిగే వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా వేసుకోబోనని ఆయన శపథం చేశారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోలను అన్నామలై గురువారం మీడియాకు వెల్లడించారు.
ఆ సందర్భంగానే ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం కొరడాతో ఆరుదెబ్బలు కొట్టుకుంటానని, ఆ రోజు నుంచి 48 రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని, డీఎంకే అవినీతి పాలన ముగిసిపోయే వరకు తాను కాళ్లకు చెప్పులు వేసుకోబోనని అన్నామలై ప్రకటించారు. ఆ ప్రకారమే ఇవాళ ఆయన కొరడాతో కొట్టుకున్నారు.
#WATCH | Coimbatore | Tamil Nadu BJP president K Annamalai self-whips himself as a mark of protest to demand justice in the Anna University alleged sexual assault case. pic.twitter.com/ZoEhSsoo1r
— ANI (@ANI) December 27, 2024
#WATCH | Coimbatore | Tamil Nadu BJP president K Annamalai says, “Anybody understanding the Tamil culture will always know these are all part of the land. Flogging ourselves, punishing ourselves and putting ourselves through tough rhythms are all part of this culture. This is not… pic.twitter.com/NGkYUhDtUj
— ANI (@ANI) December 27, 2024