తిరువనంతపురం: చావు అనేది ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో వస్తుందో అస్సలు ఊహించలేం..! కొందరు చిన్న తేలు కరిచినా చనిపోతారు. కొందరు భారీ విషసర్పం కరిచినా బతికిపోతారు. కొందరు బాత్రూమ్లో జారిపడినా చనిపోతారు. కొందరు మాత్రం బావిలోపడినా బతికిపోతారు. ఇలాంటి ఆశ్చర్యపరిచే ఘటనా తాజాగా కేరళలలో చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలుజారి 50 అడుగుల లోతు బావిలోపడింది.
అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తమ దగ్గర ఉన్న నిచ్చెన లాంటి తాడు సాయంతో కొందరు అగ్నిమాపక సిబ్బంది బావిలోకి దిగి.. బాధిత మహిళను భారీ వలలోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆమెను స్థానికుల సాయంతో పైకి లాగి కాపాడారు. అయితే, 50 అడుగుల లోతు బావిలోపడినా బాధిత స్వల్పగాయాలు కూడా కాలేదు.
దాంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా ఒకసారి వీక్షించండి.