బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (PSI) రిక్రూట్మెంట్ జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈ కుంభకోణంవల్ల నష్టపోయిన బాధితులు రాష్ట్ర హోంమంత్రికి తమ గోడు చెప్పుకోవాలని భావించారు. అందులో భాగంగా ఇవాళ తుమకూరులోగల కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటివద్దకు చేరుకున్నారు.
అయితే, అక్కడ కాపలాగా ఉన్న తుమకూరు పోలీసులు బాధితులను అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా తుమకూరు డిప్యూటీ ఎస్పీ పీ శ్రీనివాస్ సహనం కోల్పోయి బాధితులపై దాడికి పాల్పడ్డారు. ఓ బాధితుడిని చెంపపై కొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. కాగా, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
#WATCH | Karnataka: Tumakuru Dy SP P Srinivas slapped & sent away victims of the PSI (police sub-inspector) recruitment scam, today. Victims had come to speak with the State Home Minister Araga Jnanendra about the difficulties they faced due to the scam. pic.twitter.com/UfmGzARilv
— ANI (@ANI) November 1, 2022