Cricket stadium : కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని తుమకూరు (Tumakuru) జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ మేరకు ‘కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు (KIADB)’ నుంచి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోషియేషన్ (KSCA) కు భూకేటాయింపు జరిగింది. స్టేడియం నిర్మాణానికి మొత్తం 41 ఎకరాల భూమిని కేటాయించారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddha Ramaiah) ఇవాళ ఉదయం తుమకూరులో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. మొత్తం 41 ఎకరాల్లో నిర్మించనున్న ఈ స్టేడియాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మొత్తం రూ.150 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. స్టేడియం పూర్తయితే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి.
#WATCH | Karnataka CM Siddaramaiah lays the foundation stone of an international cricket stadium in Tumakuru
Video source: CMO pic.twitter.com/7ipy4o4stS
— ANI (@ANI) December 2, 2024