Chennai CP : తమిళనాడు శాఖ బీఎస్పీ అధ్యక్షుడు (BSP chief) కె ఆర్మ్‌స్ట్రాంగ్ (K Armstrong) హత్య నేపథ్యంలో బదిలీ అయిన చెన్నై పోలీస్ కమిషనర్ (Chennai CP) సందీప్ రాయ్ రాథోడ్ (Sandeep Roy Rathore) స్థానంలో కొత్త సీపీ వచ్చారు. ప్రస్తుతం చెన్నై నగర అదనపు పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ఎ అరుణ్ (A Arun).. నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కే ఆర్మ్‌స్ట్రాంగ్ మూడు రోజుల క్రితం చెన్నై నగరంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును తమిళనాడు సర్కారు సీరియస్‌గా తీసుకుంది. ఘటనకు బాధ్యుడిగా చెన్నై సీపీ సందీప్ రాయ్ రాథోడ్‌ను బదిలీ చేసింది. పోలీస్ ట్రెయినింగ్ కాలేజీ డీజీపీగా ఆయనను నియమించింది. అడిషనల్ సీపీగా ఉన్న ఎ అరుణ్‌ను చెన్నై నగర కొత్త కమిషనర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
ఆర్మ్‌స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి పెరంబూరులోని తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి ఆయనను హత్య చేశారు. ఆదివారం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి చెన్నైకి వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యతో దళిత నేతలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.
#WATCH | Tamil Nadu | IPS officer A Arun takes charge as the Police Commissioner of Chennai, replaces Sandeep Rai Rathore. pic.twitter.com/XGuawzL7fG
— ANI (@ANI) July 8, 2024