Robbery : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో నేరాలు పెరిగిపోతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలతో ఎప్పుడూ ఢిల్లీ పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా అక్కడ మరో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ ఒక వ్యాపారి నుంచి రూ.80 లక్షలు దోచుకుపోయాడు. మార్కెట్లో అందరూ చూస్తుండగా దొంగ తన పని పూర్తిచేసుకుని ఉడాయించాడు.
వ్యాపారి బ్యాగులో రూ.80 లక్షలు ఉన్నాయని పసిగట్టిన దొంగ.. బ్యాంకు దగ్గరి నుంచి అతడిని అనుసరించాడు. చాందిని చౌక్‌లోని ఓ ఇరుకు రోడ్డులోకి వెళ్లిన తర్వాత తుపాకీతో కాల్పులు జరుపుతూ వ్యాపారి నుంచి బ్యాగు లాక్కున్నాడు. ఆ దొంగ వ్యాపారిని టార్గెట్ చేయకుండా నేలపై కాల్పులు జరుపుతూ వ్యాపారిని భయపెట్టాడు. బ్యాగు లాక్కున్న తర్వాత అందులో నుంచి రూ.80 లక్షలు తీసుకుని బ్యాగు అక్కడే పడేసి పారిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్ని అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒక నిమిషంలో ముగిసిన ఈ దోపిడీ ఘటనను చూస్తూ అక్కడున్న వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారు. అడ్డుకుంటే దుండగుడు ఎక్కడ తమపై కాల్పులు జరుపుతాడోనని వారు భయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీడియోలో ఒక్కరే కనిపిస్తున్నా ఈ దోపిడీలో మొత్తం ఆరుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దుండగుడు బ్యాగు గుంజుకుని బయటికి వెళ్లిన తర్వాత ఆరుగురు బైకులపై పారిపోయారని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
A trader in Delhi’s Lahori Gate area was robbed of nearly Rs 80 lakh at gunpoint in broad daylight. The accused fired shots before snatching the cash-filled bag in Chandni Chowk, and fleeing.#Delhi #robbery #ViralVideo pic.twitter.com/54Hg316Xb1
— Mojo Story (@themojostory) March 18, 2025