Odisha new CM | మరికాసేపట్లో ఒడిశా కొత్త సీఎం ఎంపిక.. భువనేశ్వర్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు
Odisha new CM | ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సాయంత్రం జరిగే ఒడిశా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కేంద్రమంత్రి భూపిందర్ యాదవ్ ఇప్పటికే భువనేశ్వర్‌కు చేరుకున్నారు.
Odisha new CM : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సాయంత్రం జరిగే ఒడిశా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కేంద్రమంత్రి భూపిందర్ యాదవ్ ఇప్పటికే భువనేశ్వర్‌కు చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో ఒడిశా బీజేపీ నేతలు వారికి ఘన స్వాగతం పలికారు.
ఒడిశాలో గత ఐదు పర్యాయాలుగా విజయం సాధిస్తూ వచ్చిన అధికార బీజేడీ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. దాంతో నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల ఏకధాటి పాలనకు బ్రేక్ పడింది. ఈసారి బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఘన విజయం సాధించింది. ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అధికార బీజేడీ 51 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన స్థానాలను ఇతరులు దక్కించుకున్నారు.
అయితే ఒడిశాలో బీజేపీ విజయం సాధించడంతో సీఎం పదవి ఎవరికి కట్టబెట్టాలనేదానిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సాయంత్రం ఒడిశా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆదేశించి, ఆ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్, భూపిందర్ యాదవ్‌లను కేంద్ర పరిశీలకులుగా పంపింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఎవరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటే వారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
#WATCH | Odisha: Union Ministers and BJP central observers Rajnath Singh & Bhupender Yadav arrive in Bhubaneswar to elect Legislature Party Leader. pic.twitter.com/cWtnGG5eb4
— ANI (@ANI) June 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

