గయా: బీహార్ రాష్ట్రం గయాలోని ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీకి చెందిన ఒక ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. పైలెట్ ట్రెయినింగ్ కోసం ఇద్దరు పైలెట్లతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే శిక్షణ విమానం క్రాష్ అయ్యింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలెట్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కాగా, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఓ గ్రామానికి సమీపంలో ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ కావడంతో ఆ గ్రామానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో అక్కడ గుమిగూడారు. స్థానికుల సాయంతో అధికారులు ఆ విమానాన్ని బురద ప్రాంతం నుంచి వెనక్కి నెట్టుకెళ్లారు.
స్వల్ప గాయాలతో బయటపడిన పైలెట్లు ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని అధికారులు తెలిపారు.
#WATCH | An aircraft of the Indian Army’s Officers’ Training Academy in Gaya, Bihar today crashed soon after taking off during training. Both the pilots in the aircraft are safe.
— ANI (@ANI) January 28, 2022
Video source: Local village population pic.twitter.com/gauLWCrfxN