Fire accident : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఫోమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని కరవాల్ నగర్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
అగ్నిప్రమాదం జరిగిందన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నామని, మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
#WATCH | A massive fire breaks out at a foam factory in Karawal Nagar area of North East Delhi. Fire tenders are present at the spot. Firefighting operations are underway. Details awaited. pic.twitter.com/Ogdp6oX7dW
— ANI (@ANI) December 3, 2024