కోల్కతా: పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికల వేడి.. ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు రగులుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పలు బ్లాకుల్లో గొడవలు జరిగాయి. ఓ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా మరో పార్టీ అభ్యర్థులు అడ్డుతగులుతున్నారు.
నామినేషన్లు వేసేందుకు ఊరేగింపుగా వెళ్తూ ఘర్షణలకు పాల్పడుతున్నారు. గల్లాలుగల్లాలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఇవాళ ఉదయాన్నే దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాన్నింగ్ బ్లాకులో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వెళ్లి.. ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్నారు.
#WATCH | A clash erupted between two groups of TMC outside the BDO office in Canning, South 24 Paraganas over nomination filing for West Bengal panchayat elections, earlier today pic.twitter.com/nv1wPEV7eR
— ANI (@ANI) June 14, 2023