Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం : మమతా బెనర్జీ
Mamata Banerjee: వక్ఫ్ బిల్లును బెంగాల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కొత్త వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని, దీనికి సమాధానాలు కేంద్రమే ఇస్తుందని ఆమె అన్నారు. అన్ని మతాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, అందరూ శాంతియుతంగా ఉండాలని, మతం పేరుతో విద్వేషాలకు పాల్పడవద్దు అని, ప్రతి ఒక్కరి జీవితం విలువైందని, రాజకీయాల కోసం అల్లర్లు సృష్టించవద్దు అని, హింసను ప్రేరేపించి సమాజానికి హాని చేయవద్దు అని ఆమె తెలిపారు.
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌లోని పలు జిల్లాలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మాల్దా, ముర్షీదాబాద్, సౌత్ 24 ప్రగనాస్, హూగ్లీ జిల్లాల్లో ఈ ఆందోళనలు చేపట్టారు. అనేక వాహనాలు, పోలీసు వ్యాన్లకు నిప్పుపెట్టారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. చట్టాన్ని మనం చేయలేదని, కేంద్రమే ఆ చట్టం చేసిందని, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సమాధానాన్ని రాబట్టాలని ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

