Sonam Wangchuk | సోనమ్ వాంగ్‌చుక్ చికిత్సకు నిరాకరిస్తున్నారు : వైద్యులు
Sonam Wangchuk | సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేయడంవల్ల ఆయన చాలా బలహీనంగా తయారయ్యారని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) రాజీనామా కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి (Safdarjung Hospital) కి తరలించారు.
Sonam Wangchuk : సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేయడంవల్ల ఆయన చాలా బలహీనంగా తయారయ్యారని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) రాజీనామా కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి (Safdarjung Hospital) కి తరలించారు.
ఆసుపత్రికి ఉదయం 7.40 గంటలకు వాంగ్చుక్ను తీసుకొచ్చారని బులెటిన్‌లో తెలిపింది. ఇరవై రోజులుగా ఘనాహారం తీసుకోకపోవడం వల్ల ఆయన తీవ్ర నీరసంతో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆసుపత్రిలో చేర్చిన సమయంలో ఆయనకు స్పృహ ఉందని, పల్స్, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయులు నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే శరీరంలో నీటి శాతం తగ్గిన లక్షణాలు (డీహైడ్రేషన్) కనిపించాయని చెప్పారు.
వైద్యులు ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ (ఐవీ ద్రవాలు), ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్తోపాటు అవసరమైన మందులు తీసుకోవాలని సూచించారు. కానీ వాటన్నింటినీ వాంగ్‌చుక్ తిరస్కరించినట్టు ఆసుపత్రి తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చికిత్స తీసుకోవాలని వైద్యులు కౌన్సెలింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో స్పందించారు. తన అనుమతి లేకుండా ఎలాంటి చికిత్స చేయొద్దని అన్నారు.
వైద్య చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ ఆయనను డిశ్ఛార్జ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలోనూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

