న్యూఢిల్లీ: వినాయక చవితి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని అందిస్తూ, సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ వినాయక చవితి అని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా జ్ఞానం, శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యాలను అందించే వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని పిలుపునిచ్చారు.
‘దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని అందిస్తూ, సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ వినాయక చవితి. విద్య, జ్ఞానం ఉన్నవాడు గణాధిపత్యం వహించగలడని విద్య ప్రాధాన్యతను తెలిపే పండుగ కూడా. ఏటా బంధుమిత్రులతో వైభవోపేతంగా, ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితి జరుపుకునే వాళ్ళం. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా జ్ఞానం, శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యాలను అందించే వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం.’ అని ట్వీట్ చేశారు.
ఏటా బంధుమిత్రులతో వైభవోపేతంగా, ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితి జరుపుకునే వాళ్ళం. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా జ్ఞానం, శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యాలను అందించే వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం.
— Vice President of India (@VPSecretariat) September 10, 2021