RSS : ఆరెస్సెస్ నేతల పుసక్తాలను కాలేజ్ పాఠ్యాంశాల్లో జోడించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని విపక్షాలు భగ్గుమన్నాయి. ఆరెస్సెస్ సిద్ధాంతాలను కలిగిఉన్న రచయిత పుస్తకాలను కాలేజ్ కరిక్యులమ్‌లో జోడించాలనే నిర్ణయం వెనుక కాషాయ పాలకుల ఉద్దేశం స్పష్టమైందని కాంగ్రెస్ నేత కునాల్ చౌధరి అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రేమ సిద్ధాంతాన్ని మరుగునపరిచి విద్వేషం వ్యాప్తి చేయాలని బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అవసరమైతే న్యాయస్ధానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆరెస్సెస్ నేతల పుస్తకాలను కాలేజ్ పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ కైలాష్ సారంగ్ స్వాగతించారు.
దేశ సంస్కృతి బలోపేతం చేసేందుకు తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక కుటుంబాన్ని ప్రస్తుతించే క్రమంలో దేశ చరిత్రను కాంగ్రెస్ నిరంతరం దెబ్బతీస్తున్నదని ఆరోపించారు. మన సంస్కృతి గురించి ఈ తరానికి చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
Read More :
Devara Wrapped | గుమ్మడికాయ కొట్టిన ఎన్టీఆర్ ‘దేవర’.. ఫొటో వైరల్