Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro)తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్ వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన ఘర్షణ (fighting) చోటు చేసుకుంది.
బుధవారం తెల్లవారుజామున రద్దీ రైల్లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. నిల్చోడానికి కూడా చోటు లేని రైలులో ఒకరికొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. దీంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు వీరి మధ్య ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే , వీరి గొడవకు కారణం ఏంటన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn
— Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023
Also Read..
Madonna | తీవ్రమైన ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రి పాలైన పాప్ సింగర్
Titanic submersible | ఒడ్డుకు చేరిన మినీ టైటాన్ శకలాలు.. మానవ అవశేషాలు స్వాధీనం
MLC Kavitha | తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు.. సాయిచంద్: ఎమ్మెల్సీ కవిత