e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News వైరల్‌ అయిన ఫోటో…బయటపడిన గుట్టు

వైరల్‌ అయిన ఫోటో…బయటపడిన గుట్టు

వైరల్‌ అయిన ఫోటో…బయటపడిన గుట్టు

దేశంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతూ కొత్త రికార్డ్స్‌ ని క్రియేట్‌ చేస్తోంది. ఇలాంటి టైమ్‌ లో కొద్దిరోజుల క్రితం ఓ ఫో టో అటు మీడియాని ఇటు సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. అదే ఈ పెద్దావిడ ఫోటో.

ఆక్సిజన్‌ సిలిండర్‌ తో రోడ్డుపై దీనంగా ఉన్న ఈ ఫోటోని చూపించి కొందరు భారత్‌ లోని సెకండ్‌ వేవ్‌ దుస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారంటూ మీడియాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదన్న నిజాన్ని కొందరు బయటపెట్టారు.

2018లో ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటో అంటూ ఆ వార్త వివరాలను కూడా తెలిపారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ ద్వారా ఆ తల్లి శ్వాస తీసుకుంటుంటే దాన్ని భుజాలపై కొడుకు ఎత్తుకున్న దృశ్యాలు సంచలనమయ్యాయి.  అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఆ తల్లీకొడుకులు రోడ్డుపక్కనే అలా కూర్చుండిపోయారు. అప్పట్లోనే మీడియాలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు.

ఆ ఫోటోలను ఎవరో ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేశారు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని టెక్‌ నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైరల్‌ అయిన ఫోటో…బయటపడిన గుట్టు

ట్రెండింగ్‌

Advertisement