Violence in Meghalaya : మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
Violence in Meghalaya : మేఘాలయలో హింస చెలరేగింది. మిలిటెంట్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. రాజధాని నగరం షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు...

షిల్లాంగ్ : మేఘాలయలో హింస (Violence in Meghalaya) చెలరేగింది. మిలిటెంట్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. రాజధాని నగరం షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలపివేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హోం మంత్రి పదవికి లహ్క్మాన్ రింబూయ్ రాజీనామా చేశారు.
పోలీసు ఎన్కౌంటర్లో ఒక మిలిటెంట్ చనిపోయిన అనంతరం మేఘాలయలో హింస చెలరేగింది. సానుభూతిపరులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచే ఆందోళనలు మిన్నంటాయి. సాయంత్రం ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి తన నివాసంలో లేరని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, వాహనాల దహనం వంటి సంఘటనలు నమోదయ్యాయి.
నిజానికి మిలిటెంట్ చెస్టర్‌ఫీల్డ్ తంకియు పోలీసుల ఎదుట ఆగష్టు 13 న లొంగిపోయాడు. అయితే, పోలీసులు అతడిని ఎన్కౌంటర్లో చంపేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 లో ఈ ఉగ్రవాది పేలుడుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయిన తంకియును ఆదివారం దహనం చేశారు. దీని తర్వాత హింస ప్రారంభమైంది.
హోం మంత్రి రాజీనామా..
ఇదిలా ఉండగా, ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మేఘాలయ హోం మంత్రి లహ్క్మాన్ రింబూయ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. తంకియు ఇంటిపై పోలీసులు దాడి చేసి తీసుకెళ్లి ఆపై ఎన్కౌంటర్లో చంపేశారని తన రాజీనామా పత్రంలో రింబూయ్ పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీసులు వారు ఏర్పాటు చేసుకున్న సూత్రాల పరిమితులను దాటారని ఆరోపించారు. ఈ సంఘటన చూసి తానెంతగానే ఆశ్చర్యపోయానని, ఈ సంఘటనపై స్వతంత్ర, న్యాయ విచారణ జరపాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
సోషల్ మీడియాలో జాతీయ గీతం కొత్త రికార్డు.. అదేంటంటే..?
ముంబై ఇండియన్స్‌కు వెరైటీగా అనౌన్స్మెంట్
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

