Loksabha Elections 2024 | తొలి దశ పోరులో బెంగాల్, మణిపూర్‌లో చెలరేగిన హింస
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో హింస ప్రజ్వరిల్లింది. కూచ్‌బెహర్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారని టీఎంసీ ఆరోపించింది. సితాల్కుచిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ మద్దతుదారులు దౌర్జన్యానికి తెగబడి ఓటర్లను సైతం బెదిరించారని టీఎంసీ నేతలు ఆరోపించారు.
ఇక మణిపూర్‌లోని తమన్పోక్కి పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు కాల్పులు జరపడంతో కలకలం రేగింది. హింస చెలరేగినా ఇప్పటివరకూ మణిపూర్‌లో 27.74 శాతం, పశ్చిమ బెంగాల్లో 33.56 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు తమిళనాడులో 39 లోక్‌సభ స్ధానాలకు తొలి దశలో ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.
తమిళనాడులో విపక్ష ఇండియా కూటమి డీఎంకే ప్రాబల్యాన్ని నిలువరించేందుకు ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేపట్టడంతో ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధిస్తామని కాషాయ పార్టీ ఆశలు పెంచుకుంది. ఇక బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పోరాడుతుండగా విపక్ష ఇండియా కూటమి పాలక ఎన్డీయే కూటమికి దీటైన పోటీ ఇచ్చేందుకు చెమటోడుస్తోంది.
Read More :
LB nagar | ఎల్బీనగర్ కార్యకర్తల సమావేశంలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

