బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 15:59:03

'ఐఏఎస్‌లకు ఏం తెలుసని అంటున్నాడు!'

'ఐఏఎస్‌లకు ఏం తెలుసని అంటున్నాడు!'

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా చంద్రబాబు చేస్తున్న విమర్శలపై విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'కండిషన్ అదుపు తప్పుతోంది. ఇక గొలుసులతో కట్టేయాల్సిందే. మొన్న కరోనా వైరస్ కు చికిత్స చేయడానికి ఇక్కడి డాక్టర్లకేం తెలుసని పేలాడు. జ్ఞానిని, నాకే అంతుబట్టడం లేదు స్టైరీన్ గ్యాసేమిటో, ఐఏఎస్ లకు ఏం తెలుసని అంటున్నాడు. బాధితుల ట్రీట్మెంటుకు బయటి నుంచి నిపుణులను రప్పించాలట!' అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 

'జనం జేబులు కొట్టడమే జీవిత లక్ష్యమైన బాబు జమానాలో  ప్రజల రక్తం స్ట్రా వేసుకు తాగిన జన్మభూమి కమిటీలు వికటాట్టహాసం చేస్తే-ప్రజాశ్రేయమే ప్రమాణమైన సీఎం జగన్   ఏలుబడిలో జనంకోసం రక్తం ధారవోయడానికీ వెనకాడని గ్రామ వాలంటీర్లు కథానాయకులవుతున్నారు! ఎంత తేడా!' అని ఆయన కొనియాడారు. 



logo