Watch: పోలింగ్ రోజున ఓటర్లకు డబ్బులు పంచిన బీజేపీ నేత.. వీడియో వైరల్
BJP Leader Caught 'Bribing' People | పోలింగ్ రోజున బీజేపీ నేత స్థానిక ఓటర్లకు డబ్బులు పంచారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయన పట్టుబడిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆరోపించింది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.
భోపాల్: పోలింగ్ రోజున బీజేపీ నేత స్థానిక ఓటర్లకు డబ్బులు పంచారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయన పట్టుబడిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆరోపించింది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. (BJP Leader Caught ‘Bribing’ People) కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న చింద్వారాలో మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్‌పై పోటీగా వివేక్ బంటీ సాహును బీజేపీ రంగంలోకి దించింది.
కాగా, శుక్రవారం పోలింగ్ సందర్భంగా చింద్వారా బీజేపీ నగర అధ్యక్షుడు అంకుర్ శుక్లా ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. ఓటు వేసేందుకు వెళ్లే ప్రజలను పిలిచి మరీ డబ్బులు పంపిణీ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీ తీరుపై మండిపడింది. ‘ఇదిగో బీజేపీ నీచమైన చర్య. చింద్వారాలో, బీజేపీ నగర అధ్యక్షుడు అంకుర్ శుక్లా ప్రజలకు డబ్బులు పంచుతూ (ప్రజలకు లంచం ఇస్తూ) కెమెరాకు చిక్కారు. చింద్వారా ఎన్నికలలో భారీ తేడాతో బీజేపీ ఓడిపోతుందని ఈ చర్య ధృవీకరిస్తుంది. ప్రజాస్వామ్య హంతకులను దేశం ఎప్పటికీ క్షమించదు. అవినీతికి పర్యాయపదం బీజేపీ’ అని విమర్శించింది. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बीजेपी की गंदी हरकत देखिये
छिन्दवाड़ा में बीजेपी के नगर अध्यक्ष अंकुर शुक्ला पैसे बाँटते हुए कैमरे में क़ैद हुये हैं। बीजेपी की यह हरकत बता रही है कि बीजेपी छिन्दवाड़ा का चुनाव बड़े अंतर से हार रही है।
लोकतंत्र के इन हत्यारों को देश कभी माफ़ नहीं करेगा।
“बीजेपी मतलब… pic.twitter.com/fKcNnQRryX
— MP Congress (@INCMP) April 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

