Viral Video : వింటర్లో నోరూరించే పలు రెసిపీలు, వెరైటీ ఫుడ్ కాంబినేషన్ల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక లేటెస్ట్గా ఆరెంజ్ బర్ఫీ మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరలవుతోంది. ఓంకార్ పవార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఏకంగా 1.3 కోట్ల వ్యూస్ దక్కాయి.
ఈ వీడియో తొలుత ఆరెంజ్ తోలు, గింజలు వలిచి పల్ప్‌ను ప్యాన్‌లో వేసి చక్కెర, ఫుడ్ కలర్, కొద్దిగా పాలు వేసి కుక్ చేయడంతో ఆరంభమవుతుంది. ఆపై మిశ్రమాలను బాగా కలిపి కుక్ చేయాలి. మూడు నాలుగు గుంటల వరకూ ఆరెంజ్ బర్ఫీని ఆరనిచ్చిన అనంతరం ఆపై వాటిని మీకు ఇష్టమైన షేప్స్‌లో, సైజ్‌ల్లో కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.
ఈ వీడియోను చూసిన అనంతరం నెటిజన్లు కామెంట్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు. ఈ వీడియో షేర్ చేసినందుకు ఓంకార్‌కు థ్యాంక్స్..ఈ రెసీపీని తప్పకుండా ట్రై చేస్తా అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ట్రెడిషనల్ స్వీట్స్‌లో రిఫ్రెషింగ్ ట్విస్ట్ ఈ రెసిపీ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. నాగపూర్ స్పెషల్ ట్రీట్..ఇది చాలా టేస్టీ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు.
Read More :