Animal – Arjan Vailly | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న తాజా చిత్రం ‘యానిమల్’ (Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీలోని పాటలు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న మేకర్స్ తాజాగా మరో పాటను విడుదల చేశారు.
ఈ మూవీ నుంచి మేకర్స్ ‘అమ్మాయీ’ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ లో పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోలేక పోవడంతో ఇద్దరు వారి ముందే ముద్దు పెట్టుకోవడంతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత హిమాలయాల్లో పెళ్లి చేసుకోవడంతో ముగుస్తుంది. ఇక ఈ సాంగ్ మొత్తం ప్రేమతో కూడిన రొమాన్స్‌ను చూపించాడు దర్శకుడు సందీప్. ముఖ్యంగా లిప్ లాక్స్ తో ఈ జంట అదరగొట్టారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు జామ్8 సంగీతం అందించగా.. రాఘవ చైతన్య, ప్రీతమ్ కలిసి పాడారు.