Mumthaz Ali : కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త ముంతాజ్ అలీ జాడ కోసం ఫాల్గుణి నదిలో గాలింపు కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్ వంతెనపైన ఆయన కారు పార్క్ చేసి ఉండటం, ఆ కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యి ఉండటంతో ఆయన ఏమయ్యారనేది మిస్టరీగా మారింది. ముంతాజ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఫాల్గుణి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానంతో ఆయన కోసం గాలిస్తున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి గాలింపు కొనసాగుతోంది. మంగళూరు మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడైన ముంతాజ్ ఆదివారం తెల్లవారుజామున తన కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కులూరు వంతెన సమీపంలో వ్యాపారవేత్త ముంతాజ్ అలీకి చెందిన కారు ఉన్నట్లు సమాచారం వచ్చింది. దాంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో తనిఖీ చేశారు. ముంతాజ్ కనిపించకపోవడంతో నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆ మేరకు ఫాల్గుణి నదిలిలో గాలింపు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
#WATCH | Mangaluru, Karnataka: Search operation for missing businessman Mumthaz Ali enters the second day. Visuals from Phalguni River.
His damaged car was found near Kulur Bridge on October 6. pic.twitter.com/LgIskM38Os
— ANI (@ANI) October 7, 2024