పాట్నా: ఒక బాలికకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. నిరు పేదలైన ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ సహాయం కోరినా ఫలితం లేకపోయింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనూ సూద్ ఆ చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. బీహార్లోని నెవాడా జిల్లాకు చెందిన రెండున్నర ఏళ్ల బాలికకు పుట్టుక నుంచే రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. ఒక జత చేతులు, కాళ్లు సాధారణంగా ఉండగా, రెండో జత చేతులు, కాళ్లు పొట్ట భాగంలో ఉన్నాయి. ఆ బాలిక తల్లిదండ్రులు పేదవారు. దీంతో ఆమె తల్లిదండ్రులు సహాయం కోసం నెవాడా జిల్లా ఎస్డీవోను కలిశారు. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.
కాగా, బీహార్ బాలికకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులున్న సంగతిని తొలుత ఒక హిందీ న్యూస్ ఛానెల్ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పేదలకు సహాయం చేయడంలో ముందుండే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ దృష్టికి ఇది వచ్చింది. ఆయన వెంటనే స్పందించారు. బాలికను వైద్యులకు చూపించారు. ఆ చిన్నారిని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ట్వీట్ చేశారు. ‘టెన్షన్ పడకండి. ఆ బాలిక కోసం ప్రార్థించండి’ అని అందులో పేర్కొన్నారు.
Read Also : నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
మరోవైపు సోనూ సూద్ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన ఆదుకునే గుణాన్ని నెటిజన్లు కొనియాడారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ బాలికకు వైద్యం చేయించాలని కొందరు డిమాండ్ చేశారు.
टेन्शन मत लीजिए इलाज शुरू करवा दिया है। बस दुआ करिएगा। https://t.co/gndrRhuNQJ pic.twitter.com/YoCTRoqoir
— sonu sood (@SonuSood) May 28, 2022