తిరువనంతపురం: వచ్చే వారం కేరళలో భారీగా వర్షాలు కురవనున్నాయి. భారతీయ వాతావరణ శాఖ(IMD Warning) ఇవాళ హెచ్చరిక జారీ చేసింది. కేరళలోని ఉత్తర జిల్లాల్లో అతి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్గడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో పాటు మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నౌర్, కాసర్గడ్ జిల్లాలకు ఆదివారం ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
కేరళలోని కొన్ని ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురవనున్నాయి. ఆరెంజ్ అలర్ట్ అంటే సుమారు 11 సెమీ నుంచి 20 సెమీ వర్షపాతం నమోదు అవుతుంది. ఎల్లో అలర్ట్ అంటే 6 నుంచి 11 సెమీ వర్షం కురుస్తుంది.