జైపూర్: రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే(Vasundhara Raje Scindia) విజయం సాధించారు. జల్రాపతాన్ స్థానం నుంచి ఆమె గెలుపొందారు. 53వేల ఓట్లతో ఆమె విక్టరీ కొట్టారు. 2003 నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచే ఆమె పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్వేంద్ర సింగ్‌పై 35వేల ఓట్ల తేడాతో విజయం సాదించారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంలో ఉన్నది. ఆ పార్టీ 113 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. రాజస్థాన్ సీఎంగా మళ్లీ వసుంధరా రాజే బాధ్యతలు చేపట్టనున్నారు.