యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, యోగీ రికార్డుల మోత.. ఏమిటా ఏడు రికార్డులు..?
UP Election result: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీతోపాటు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రికార్డుల మోత మోగిస్తున్నారు. యూపీలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం, యోగీ రెండోసారి సీఎం కుర్చీలో కూర్చోవడం ఇప్పటికే
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీతోపాటు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రికార్డుల మోత మోగిస్తున్నారు. యూపీలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం, యోగీ రెండోసారి సీఎం కుర్చీలో కూర్చోవడం ఇప్పటికే ఖాయమైనందున.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు రికార్డులు నమోదు కాబోతున్నాయి. మరి ఆ రికార్డులేంటో తెలుసుకుందామా..?
1. ఐదేండ్ల పదవీకాలం పూర్తై రెండోసారి పార్టీని గెలిపించిన తొలి సీఎం
ఉత్తరప్రదేశ్‌లో 1952, మే 20న తొలి అసెంబ్లీ కొలువుదీరింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 70 ఏండ్లలో మొత్తం 21 మంది సీఎంలుగా పనిచేశారు. అయితే, ఈ 70 ఏండ్ల యూపీ ఎన్నికల చరిత్రలో ఐదేండ్ల పూర్తికాలం పదవిలో ఉండి, వరుసగా రెండోసారి తన పార్టీని అధికారంలోకి తెచ్చిన తొలి సీఎంగా యోగీ రికార్డు సృష్టించాడు.
2. వరుసగా రెండోసారి పదవిలోకి వచ్చిన ఐదో సీఎం యోగీ
ముఖ్యమంత్రిగా ఎన్నికలను ఎదుర్కొని వరుసగా రెండోసారి సీఎం పదవిలోకి వచ్చిన ఐదో వ్యక్తిగా కూడా యోగీ ఆదిత్యనాథ్ పేరిట రికార్డు నమోదు కాబోతున్నది. యోగీ కంటే ముందు 1957లో సంపూర్ణానంద, 1962లో చంద్రభాను గుప్తా, 1974లో హేమ్వతి నందన్ బహుగుణ, 1985లో నారాయణ్ దత్ తివారీ వరుసగా రెండోసారి సీఎంలు అయ్యారు.
3. 37 ఏండ్ల తర్వాత వరుసగా రెండోసారి సీఎం పదవి
చివరిసారిగా 1985లో ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీ తివారీ వరుసగా రెండోసారి సీఎం పదవి చేపట్టాడు. ఆ తర్వాత ఈ 37 ఏండ్లలో ఎవరూ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవిలోకి రాలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
4. రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి బీజేపీ సీఎం
వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా కూడా యోగీ ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో అంటే యోగీ ఆదిత్యనాథ్ కంటే ముందు కళ్యాణ్‌సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా వరుసగా రెండోసారి సీఎం పదవి చేపట్టలేదు.
5. 15 ఏండ్ల తర్వాత తొలి ఎమ్మెల్యే సీఎం
దాదాపు 15 ఏండ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సీఎం కాబోతున్నాడు. గతంలో 2007లో ఎమ్మెల్సీగా మాయవతి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2012లో అఖిలేష్ యాదవ్ కూడా ఎమ్మెల్సీగా సీఎం బాధ్యతలు తీసుకున్నారు. 2017లో యోగీ ఆదిత్యనాథ్ కూడా లోక్‌సభ సభ్యుడిగా ఉండి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు.
6. పూర్తికాలం పదవిలో ఉన్న మూడో సీఎం
యోగీ ఆదిత్యనాథ్ పూర్తిగా ఐదేండ్లు పదవిలో ఉన్న యూపీ మూడో ముఖ్యమంత్రిగా కూడా రికార్డు సృష్టించాడు. 70 ఏండ్ల యూపీ అసెంబ్లీ చరిత్రలో సీఎంలుగా పనిచేసిన 21 మందిలో యోగీ ఆదిత్యనాథ్ కంటే ముందు ఇద్దరు మాత్రమే పూర్తికాలం పదవిలో ఉన్నారు. మొదటి వ్యక్తి బీఎస్పీ అధినేత్రి మాయావతి (2007-2012 వరకు) కాగా, రెండో వ్యక్తి సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (2012-2017 వరకు). తాజాగా యోగీ ఆదిత్యనాథ్ మూడో వ్యక్తిగా వారి సరసన చేరాడు.
7. నోయిడా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన తొలి సీఎం
ఉత్తరప్రదేశ్‌లో నోయిడాకు సంబంధించి ఓ సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది. ఎన్నికల ముందు నోయిడాలో పర్యటించిన ఏ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రాలేదు. అయితే యోగీ ఆదిత్యనాత్ నోయిడాలో పర్యటించినప్పటికీ రెండోసారి విజయం సాధించి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడు. ఇది కూడా ఒక రికార్డే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

