గణతంత్ర వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్ సంప్రదాయానికి చిహ్నమైన టోపీ, మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబించే కండువాను వేసుకొని ప్రధానిమోదీ ప్రత్యేక వస్త్రధారణతో సంద డి చేశారు. టోపీపై బ్రహ్మకమలం గుర్తు ఉన్నది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. ఉత్తరాఖండ్, మణిపూర్‌కు త్వరలోఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ర్టాల సంస్కృతికి తగినట్టుగా ప్రధాని వస్త్రధారణ ఉండటం గమనార్హం.